నరసాపురం: న్యాయవాద వృత్తిలో విలువలు కాపాడుతూ అడ్వకేట్ యామర్తి వెంకటేశ్వరరావు (వైవీఆర్) జీవించారని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచంద్రరావు అన్నా రు. ఆదివారం స్థానిక తెలగా కల్యాణ మండపంలో యామర్తి శత జయంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రా మచంద్రరావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విలువలు కాపాడటంలో న్యాయవాదులు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కక్షిదారులకు న్యాయం చేయడంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. మూడు దశాబ్దాలపాటు వైవీఆర్ చేసిన సేవలను కొనియాడారు. సభకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ సీవై సోమయాజులు, జస్టిస్ డీఎస్ వర్మ మాట్లాడారు. వైవీఆర్ కుమారుడు చంద్రశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయాన్ని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి దంపతులు సందర్శించారు. ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చే యించారు. తణుకు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి జి.స్వర్ణ, కొవ్వూరు సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్ ఉన్నారు. ఆలయ ఈఓ గుబ్బల రామపెద్దింట్లురావు ఆలయ మర్యాదలతో న్యాయమూర్తులకు స్వాగతం పలికారు.
బుట్టాయగూడెం : మండలంలోని కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బ ల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూ జలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయయని, ఈనెల 21 వరకు కొనసాగుతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. 13న నరసాపురం వలంధర్ రేవులో, 14న పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నా రు. 21న భీమవరంలో జిల్లాస్థాయి యోగా ది నోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామన్నా రు. జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కో మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో 50 మందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు.
భీమవరం: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి బూరాడ మధుబాబు హెచ్చరించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదివారం జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె వీఆర్వో మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారుల తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధికారుల వేధింపులతోనే హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ మే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కు టుంబానికి సముచిత న్యాయం చేసి ఆర్థిక భ రోసా కల్పించాలని కోరారు. వేధింపులతో ఆ త్మహత్యలకు పాల్పడటం విచారకరమన్నారు.


