గుర్తుతెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

గుర్తుతెలియని మృతదేహం లభ్యం గ్రామ సచివాలయంలో శిలాఫలకం తొలగింపు రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

దెందులూరు: ఏలూరు రూరల్‌ మండలం చొదిమెళ్ళ పరిధిలోని కొత్తచెరువు పక్కన ఉన్న వేపూరి శ్రీనివాసరావు కొబ్బరి కోకో తోట గట్టు పక్కన 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహం లభ్యమైంది. సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నట్లు ఏలూరు రూరల్‌ ఎస్సై వేముల వెంకటేశ్వరరావు అన్నారు. అతని శరీరంపై నీలం రంగు లుంగీ, తెలుగు పింక్‌ రంగు గడుల చొక్కా, భుజంపై లేత పచ్చ గడుల కండువా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

పెనుగొండ: అధికార పక్ష నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామన్నపాలెం పంచాయతీ పాలక వర్గ తీర్మానం చేయగా.. గత పాలకవర్గంలో శిలాఫలకం ఏర్పాటు చేశారు. పాలకవర్గంలో సర్పంచ్‌, వార్డు సభ్యులతో శిలాఫలకం వేయించడం రివాజు. రామన్నపాలెంలోనూ అలాగే వేయించారు. పాలకవర్గ పదవీ కాలం ముగిసిన అనంతరం అఽధికారులు ఆ శిలాఫలకాన్ని తొలగించడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది. కూటమి నాయకుల ఒత్తిడితోనే శిలాఫలకం తొలగించారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గ శిలాఫలకం కూటమి నాయకుల ఒత్తిడితోనే తొలగించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అఽధికారులు తీరు మార్చుకొని శిలాఫలకం తిరిగి ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌చేశారు.

జంగారెడ్డిగూడెం: మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందిన ఘటన ఏలూరు రోడ్డు గుర్వాయిగూడెం పరిధిలోని జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్సై షేక్‌ జబీర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండలపేట మండలం మోదకుదురు గ్రామానికి చెందిన జక్కంశెట్టి నాగేశ్వరరావు (65) చాలా కాలం క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఉంటూ, జీడిపిక్కల గింజల ఫ్యాక్టరీ వద్ద చెరుకు రసం తీసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చెరుకు తుక్కు రోడ్డు అవతల పడవేసి వస్తున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ వృద్ధుడిని అతి వేగంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యువకులు వాహనంతో సహా పారిపోయారు. ఎస్సై షేక్‌ జబీర్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వృద్ధుడి మృతికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement