డ్రోన్‌ కెమెరాలతో నిఘా | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పరిధిలోని వైఎస్సార్‌ కాలనీ, పోణంగి గ్రామాలపై డ్రోన్‌ కెమెరాలతో ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్‌ కాలనీ, పోణంగి గ్రామాల పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలు, సామాజిక నేరాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు డ్రోన్‌ నిఘా ఉపయోగపడుతుందని సీఐ తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించటంతోపాటు నేరాలకు పాల్పడే వారిలో చట్టం పట్ల భయం ఉండాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement