న్యూస్‌రీల్
డీఎస్సీ అర్హులకు న్యాయం చేయాలి
మోసమే బ్రాండ్‌గా కూటమి పాలన
● డీఎస్సీ నిర్వహణ తీరుపై అసంతృప్తి
● క్రీడా కోటా భర్తీలో అన్యాయం
● అర్హులకు న్యాయం చేయాలంటున్న ఉద్యోగ, విద్యార్థి సంఘాలు
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం, మర్యాద ప్రత్యేకమైనవి. అనేక మంది ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలని ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే అని చంద్రబాబు అనేక ప్రచార సభల్లో నిరుద్యోగులను నమ్మించారు. తొలి సంతకం డీఎస్సీ ఫైలుపై చేయకుండా చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రతిపక్షాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై చేసిన అలుపెరుగని పోరాటానికి తలొగ్గి ఎట్టకేలకు డీఎస్సీని పట్టాలెక్కించారు. అయితే డీఎస్సీ ఫైలుపై చేసిన సంతకం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని నిరుద్యోగులు అసలు అనుకోలేదు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన నాటి నుంచి వాటి ఫలితాల విడుదల, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటి అంశాల్లో ప్రభుత్వం చేసిన జిమ్మిక్కులకు నిరుద్యోగులు ఒక్కసారిగా కుదేలయ్యారు. గతంలో జరిగిన విధంగా రిజర్వేషన్లను గానీ, రోస్టర్ పాయింట్లను గానీ పట్టించుకోకుండా తమకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిబంధనలు మార్చి నిరుద్యోగులను ఏమార్చడంతో, ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని నిరుద్యోగులు హతాశులయ్యారు.
మోసపోయిన అర్హులు
జిల్లాలోని పోలవరం ప్రాంతానికి చెందిన ఒక గిరిజనుడు క్రీడల్లో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ డీఎస్సీలో కూటమి ప్రభుత్వం నూతనంగా తెరపైకి తెచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ విధానంతో అతను ఉద్యోగం రాకుండా నిరుద్యోగిగా మిగిలిపోయాడు. తనకన్నా తక్కువ స్థాయిలో పతకం సాధించిన వ్యక్తికి ఉద్యోగం రావడం అతనిని కలిచివేసింది. ఏలూరు నగరంలో ఒక పాఠశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పీఈటీగా పని చేస్తున్న మరో వ్యక్తి సైతం జాతీయ స్థాయి పతకం సాధించాడు. ఆయనకు కూడా కాదని, ఆయనకంటే తక్కువ స్థాయి పతకం సాధించిన వ్యక్తికి ఉద్యోగం లభించింది. దీంతో కూటమి నిర్వహించిన డీఎస్సీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమే అంటూ నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం చూస్తుంటే భారీ స్థాయిలోనే అక్రమాలు జరిగినట్టు అర్థమవుతోంది. అనర్హులకు కట్టబెట్టిన పోస్టులను తొలగించాలి. మరో సారి కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కేంద్ర స్థాయిలో విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పి.శివశంకర్, డీవైఎఫ్‌ఐ
ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం కొట్టిన చీకటి దెబ్బకు మోసమే తమ బ్రాండ్‌గా కూటమి పాలన సాగు తోందని నిరుద్యోగులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. నిబంధనల మేరకు, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ఉద్యోగాన్ని ప్రభుత్వం లక్షల రూపాయలకు అమ్మేసుకుందని గగ్గోలు పెట్టారు. వారి కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన నిర్వహించిన డీఎస్సీలో మొత్తం 1035 పోస్టులను చూపించగా, పరీక్ష నిర్వహించిన అనంతరం 1026 మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వీరిలో ఇద్దరు ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. మరొకరిని అధికారులు విత్‌హెల్డ్‌లో పెట్టారు. ప్రస్తుతం 1035 పోస్టులకు ఈ డీఎస్సీలో 1023 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. ఇదిలా ఉండగా క్రీడల కోటాలో కూడా ఉద్యోగాలు ఇవ్వడంతో జిల్లాలో మొత్తం 26 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారిలో ఒకరు ఉద్యోగంలో చేరలేదు. మిగిలిన వారందరూ ఉద్యోగంలో చేరారు. ఎంపికై న వారిలో ఉద్యోగంలో చేరిన వారిని మినహాయించి మిగిలిన 13 పోస్టులను ప్రస్తుతం నిర్వహించిన డీఎస్సీ నుంచే ఎంపిక చేయవచు. అయితే అధికారులు అటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని అర్హులైన అభ్యర్థులు చెబుతున్నారు.


