కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

కొయ్యలగూడెంలో అగ్నిప్రమాదం ఖతర్‌లో వైఎస్సార్‌సీపీ నిరసన

కొయ్యలగూడెం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించి నగదుతో పాటు గృహోపకరణాలు బూడిదయ్యాయి. 10లో u
ఖతర్‌లో వైఎస్సార్‌సీపీ నిరసన

భీమవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విదేశాలకు సైతం పాకింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఖతర్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ షేక్‌ జాఫర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, జగన్‌ అభిమానులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా హుస్సేన్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఇతర కూటమి నాయకులు సూపర్‌సిక్స్‌ పథకాలంటూ హామీలిచ్చి రెండేళ్లల్లో అమలుచేయకుండా అన్ని వర్గాల ప్రజలకు కూటమి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, లక్షల్లో ఉద్యోగాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా అంటూ అర్హులను పక్కన పెట్టి లోకేష్‌కు కావల్సిన వారికి ఉద్యోగాలిచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో జీసీసీ కో కన్వినర్‌ దొండపాటి శశికిరణ్‌, శీకొలు బాబు, వాసర్ల సురేష్‌, రాపాక సూర్య, షైక్‌ షాన్‌, మనీష్‌ రెడ్డి, మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement