యోగాంధ్రలో అవార్డు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రలో అవార్డు సాధించాలి

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

యోగాంధ్రలో అవార్డు సాధించాలి

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందేలా యోగాంధ్ర– 2026 కార్యక్రమాన్ని నిర్వహించా లని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ అధికారులను ఆదేశించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ సంసిద్ధతపై దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల అధికారులతో శనివారం సాయంత్రం జేసీ టెలి కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్టర్‌ ట్రైనర్లు, ట్రైనర్ల నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేసి, 7 నుంచి ప్రజలకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర –2026 థీమ్‌పై రూపొందించిన బ్యానర్‌ను కార్యక్రమంలో తప్పక ప్రదర్శించాలన్నారు. యోగా ఆవశ్యకత, ఆరోగ్య ప్రయోజనాలపై జూనియర్స్‌ కేటగిరిలో విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీలలో గ్రామ స్థాయిలో వివిధ విభాగాలలో పోటీల నిర్వహించాలని, పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు కావాలన్నారు. జిల్లాలో 191 మంది మాస్టర్‌ ట్రైనర్లు నమోదు అయ్యారని, వారితో మండల, గ్రామ స్థాయిలో ట్రైనర్లకు శిక్షణ అందించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement