ఎత్తిపోతల పథకం అధ్యక్షుడి మార్పుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పథకం అధ్యక్షుడి మార్పుపై నిరసన

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

పోలవరం రూరల్‌: మండలంలోని 2600 ఎకరాలకు సాగునీరు అందించే గూటాల ఎత్తిపోతల పథకం ప్రస్తుత అధ్యక్షుడిని మార్చడంతో ఆ పథకం వద్ద శుక్రవారం సాయంత్రం రైతులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఈ పథకం అధక్షుడిగా కరిబండి శ్రీను కొనసాగుతుండగా, మరో వ్యక్తిని కొత్తగా అధ్యక్షుడిగా నియమించాలని అధికారులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇవ్వడంతో రైతులు సమావేశమయ్యారు. అధ్యక్ష స్థానంలో శ్రీనునే కొనసాగించాలని ఏపీఎస్‌ఐడీసీ ఏఈ సురేంద్రకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఆందోళన స్థలి వద్దకు సీఐ కృష్ణకుమార్‌, ఎస్సై అప్పారావులు చేరుకుని రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement