ఏలూరు (టూటౌన్): నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతి క బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ధర్నాచౌక్‌లో ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్షను 20 లక్షల మందికి పైగా రాశారని, పరీక్ష రద్దుతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే కారణమని, తక్షణమే ఎన్‌టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎ త్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించా రు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సిద్దు, ఆకాష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


