న్యూస్‌రీల్
ప్రభుత్వం ఆదుకోవాలి
కూటమి ఎన్నికల హామీలు ఏమాయ్యాయి?
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీలి విప్లవానికి చిరునామాగా నిలిచిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆక్వారంగ ఊపిరిని కూటమి ప్రభుత్వ పాలన తీసేస్తోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వారంగం దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుండగా.. ఏలూరు జిల్లా కలిదిండి మండలం తలసరి ఆదాయంలో ఏపీలో ప్రథమ స్థానం, కై కలూరు మండలం ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న ఆక్వారంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కంపెనీలు మేత ధరల పెంపు నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు మొత్తంగా 2.90 లక్షల్లో ఆక్వాసాగు ఉంది. మొత్తంగా 65 వేల మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా రొయ్యల మేతల ధరలను తయారీ కంపెనీలు పెంచుతున్నామని ప్రకటించ డంతో రైతులు రోడ్డెక్కారు. వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ధరల నియంత్రణకు ముందు చూ పుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ (అప్సడా) చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.
రొయ్య రైతు.. కంట కన్నీరు
ఒకప్పుడు మీసం మెలిసిన రొయ్య రైతుల కళ్లల్లో నేడు కన్నీరు కనిపిస్తోంది. మేత (ఫీడ్) ధరల పెంపు నిర్ణయం కుదుపు కుదిపేసింది. మేత తయారు చేసే కంపెనీలు టన్నుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు (వనామీ రొయ్యల మేత కిలోకు రూ.8, టైగర్ రొయ్యల మేత కిలోకు రూ.10 చొప్పున) ధరలను పెంచేశాయి. మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను పెంచుతున్నాయని రైతులు పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మేత బస్తాలను రోడ్లపై తగలబెట్టారు. రైతులతో చర్చించకుండా ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు ఒక్క పైసా కూడా తగ్గించని కంపెనీలు ఇప్పుడు అమాంతం ధరలు ఎలా పెంచుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతు నెత్తిన గల్ఫ్ సంక్షోభం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల సముద్ర ఆహార ఎగుమతులు నిలిచిపోయాయి. ఆయా దేశాలకు పంపిన కంటైనర్లు తిరిగి వెనక్కి రావడం, కొత్త ఎగుమతి ఆర్డర్లు రద్దు కావడంతో స్థానిక మార్కెట్‌లో రొయ్యల నిల్వలు పెరిగిపోయి రైతులు భయాందోళనతో తక్కువ ధరలకే విక్రయించాల్సి వస్తోంది. వాతావరణంలో వేగంగా వచ్చిన మార్పుల వల్ల చెరువుల్లో రొయ్యలకు వైట్ స్పాట్ సిండ్రోమ్ (తెల్లమచ్చ తెగులు) వంటి వైరల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులు పంట కాలం పూర్తికాకముందే అత్యవసరంగా రొయ్యలను తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు.
రొయ్యల చెరువు
అయ్యో.. ఆక్వా
ఒడుదొడుకుల మధ్య ఆక్వారంగం
నలిగిపోతున్న రొయ్యల రైతులు
మేత ధరలపై స్పష్టమైన ప్రకటన చేయని ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో సాగు
ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడంతో పాటు ఎన్నో వేల కుటుంబాలకు ఆక్వారంగం ఉపాధి కల్పిస్తోంది. ఇటువంటి రంగా న్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అప్సడా చట్టాలకు అనుగుణంగా ధరల ని ర్ణయాల్లో రైతులను భాగస్వాములు చేయాలి.
– బలే నాగరాజు, ఆక్వా రైతు,
చింతపాడు, మండవల్లి మండలం
అధికారం సాధించిన ఆరు నెలల్లో ఆక్వా రైతులకు ఆక్వా జోన్స్‌తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ ధర రూ.1.50కే అందిస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఊదరగొట్టారు. గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఆక్వా రైతుల సబ్సిడీపై మాట్లాడటం లేదు. అలాగే తయారీ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కోల్ట్ స్టోరేజీలు నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కరోనా సమయంలో సైతం ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఆటంకం కలిగించలేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.


