ఏలూరు (టూటౌన్): పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం. మీనాదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ ప ర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని రక్షించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రజలందరి బాధ్యత అన్నారు. మొక్కలు పెంచడం, నీరు, విద్యుత్ ఆదా, చెత్త రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా ఇన్‌చార్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ప్రమీలరాణి, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ కె.స్పందన, బార్ అసోసియేషన్ ప్రె సిడెంట్ కొనే సీతారాం, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఆఖరి రోజు ఇంగ్లిష్ పరీక్షకు 1,043 మంది విద్యార్థులకు 438 మంది హాజరయ్యారు. అధికారులు 13 కేంద్రాల్లో తనిఖీలు చేశారని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు 3,952 మంది
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు శుక్రవారం 3,952 మంది విద్యార్థులు హా జరయ్యారు. ఉదయం 32 కేంద్రాల్లో ఫస్టియర్ ఎకనామిక్స్ పరీక్షకు 901 మందికి 795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 756 మందికి 622 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 31 కేంద్రాల్లో సెకండియర్ మ్యాథ్స్–2బీ పరీక్షకు 2,217 మందికి 2,043 మంది, 645 మంది ఒకేషనల్ విద్యార్థులకు 492 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహాన్ తెలిపారు.
నేడు క్వాలిఫయింగ్ పరీక్ష
శనివారం ఇంటర్మీడియెట్ క్వాలిఫయింగ్ పరీక్ష (పర్యావరణ విద్య)ను 60 కేంద్రాల్లో 449 మంది విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి.
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శుక్రవారం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ప్రా రంభమైంది. ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆ చార్య మద్దాలి లక్ష్మీ నారాయణరావు మాట్లాడుతూ ఎన్‌సీసీ, స్పోర్ట్స్, క్యాప్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నామన్నారు. తొలిరోజు 749 మంది విద్యార్థులకు 511 మంది హాజరయ్యా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, డీన్ అకడమిక్ సాదు చిరంజీవి, పరిపాలనాధికారి బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, హిందీ, చరిత్ర, గణితం, సంస్కృతం, తెలుగు, బోటనీ, రసాయనశాస్త్రం, సివిక్స్, కామర్స్, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టులకు జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు కలిపి 12 సబ్జెక్టులకు నియమించిన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు అదే రోజు ఉదయం 10 గంటలకు, స్క్రూటినైజర్లు సోమవారం ఉదయం 10 గంటలకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విధులకు హాజరుకాకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


