మండవల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై గట్టిగా నిలదీద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. మండవల్లి సెంటర్‌లో దివంగత వైఎస్సార్ వి గ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీ రామదుర్గాప్రసాద్ (రాము), మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి ఏశావురాజు ఆధ్వర్యంలో శుక్రవా రం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమా న్ని నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నా రు. ఈ సందర్భంగా కూటమి ఎన్నికల మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలతో సంతకాలు పెట్టి పంచిన బాండ్ల కాపీలను దహనం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


