నవధాన్యాల సాగు.. బాగు
నేల ఆరోగ్యం, ఉత్పాదక శక్తి పెంపు, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెరగడంతో నవధాన్యాల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. 8లో u
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ వార్షిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని విభాగాలను పరిశీలించారు. జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్‌బీ) స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), ఫింగర్ ప్రింట్స్ విభాగాల పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో శాంతిభద్ర తలు, నేర నియంత్రణకు చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, మహిళలు, బాలికల భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, మహిళల మిస్సింగ్ కేసుల దర్యాప్తుకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతంగా వినియోగిస్తూ నేరగాళ్ల ఆటకట్టించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రోన్ కెమెరాల నిఘాను పెంచటం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే అవకాశం ఏర్పడు తుందనీ, నిషేధిత మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు మరింత పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆయన వెంట ఉన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా, పోలీస్ ప్రధాన కార్యాలయ ఏఓ షేక్ మస్తాన్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్‌ఐలు పవన్‌కుమార్, సతీష్, ఆయా విభాగాల డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


