ఖరీఫ్‌ సాగుకు పటిష్ట ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగుకు పటిష్ట ప్రణాళిక

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు రైతులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట ప్రణాళిక రూ పొందించుకుని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధు లు తెలిపిన అంశాలపై తీసుకున్న చర్యలు, ఖరీఫ్‌ సంసిద్ధత, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పీఎం సూర్య ఘర్‌ యోజన ప్రగతి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూ నిట్ల ఏర్పాటు, జలధార, ఇరిగేషన్‌ ఓ అండ్‌ ఎం పనుల ప్రగతి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్‌ మా ట్లాడుతూ జిల్లా ఖరీఫ్‌ ప్రారంభమైందని, విత్తనా లు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లలో 16 వేల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రా రంభించలేదని, వాటిని రద్దు చేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌కుమార్‌, పత్సమట్ల ధర్మరాజు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement