జనగణన పూర్తి చేయని అధికారులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

జనగణన పూర్తి చేయని అధికారులపై చర్యలు

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

జనగణన పూర్తి చేయని అధికారులపై చర్యలు నేడు హాకీ సెలెక్షన్స్‌

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి నివేదిక స మర్పించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జనగణనపై శుక్రవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిర్దేశిత సమయంలోపు జనగణనను పూర్తిచేయాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని, పూర్తిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హె చ్చరించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జనగణనలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జేసీ అభిషేక్‌ గౌడ, డీఆర్వో ఎల్‌.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): హాకీ ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ మెన్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ హాకీ చాంపియన్‌షిప్‌–2026 ఎంపికలు స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో శనివారం నిర్వహించనున్నామని జిల్లా హా కీ అసోసియేషన్‌ కార్యదర్శి జి.సతీష్‌బాబు ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారు లు ఈనెల 12 నుంచి ధర్మవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు 1992 జనవరి 1 తర్వాత పుట్టిన వారై ఉండాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement