వెన్నుపోటుపై జనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై జనాగ్రహం

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

కీలక మార్పులు రోడ్లపై బర్త్‌డే వేడుకలకు బ్రేక్‌

న్యూస్‌రీల్‌

కీలక మార్పులు
ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని విద్యా వ్యవస్థలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇకపై నేరుగా 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. 8లో u

రోడ్లపై బర్త్‌డే వేడుకలకు పోలీసులు బ్రేక్‌ వేశారు. వేడుకల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి జరిమానాలు వేయిస్తున్నారు. 8లో u

శురకవారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సర్కారు వెన్నుపోటుపై జనాగ్రహం పెల్లుబికింది. ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసంపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి కూటమి ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను వంచించడం మొదలుకొని అనేక హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా రెండేళ్లు కాలం గడపడంపై సర్వత్రా మండిపడ్డారు. కై కలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఏలూరు నగరంలో పార్టీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ 50 డివిజన్లల్లో కూటమి మోసాల కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.

కై కలూరులో...

నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి మండలాల్లో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కై కలూరులో పార్టీ కార్యాలయం నుంచి సంతమార్కెట్‌ వరకు మోటారుసైకిల్‌పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కలిదిండిలో దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమం జరిపారు.

చింతలపూడిలో...

నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పార్టీ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిపారు. కామవరపుకోట మండలంలో కొత్తూరు బస్టాండ్‌ నుంచి చెక్‌పోస్టు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చింతలపూడిలో తొలుత మారుతీనగర్‌ ఉన్న దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని ఫాతిమాపురంలో మండల నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. లింగపాలెం మండలంలో మండల నాయకులు, పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నూజివీడులో...

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల్లో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. నూజివీడులో టౌన్‌ ప్రెసిడెంట్‌, ముసునూరులో మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనలు జరిపారు.

ఉంగుటూరులో...

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భీమడోలు మండలంలోని భీమడోలు జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాల్లో ఆయా మండల కన్వీనర్లు చేశారు.

పోలవరంలో...

నియోజకవర్గంలోని 5 మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో జరిపారు. జీలుగుమిల్లి, టి.నర్సాపురం, కొయ్యలగూడెం మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఏలూరులో...

ఏలూరు నగరంలోని సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు 50 డివిజన్లల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. ప్రతి డివిజన్‌లో డివిజన్‌ ఇన్‌చార్జులు పాల్గొని గడిచిన రెండేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. జయప్రకాష్‌ 34వ డివిజన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు.

దెందులూరులో...

నియోజకవర్గంలోని పెదపాడు, దెందులూరు, పెదవేగి, ఏలూరు రూరల్‌ మండలాల్లో ఆయా మండల కన్వీనర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దెందులూరు మండలంలో పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలకు విశేష స్పందన

జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో వెల్లువెత్తిన నిరసనలు

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు దహనం

Advertisement
 
Advertisement
Advertisement