కూటమి ప్రభుత్వ పింఛన్ స్టంటు ఇది.. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో ఒక వృద్ధుడికి పింఛన్ ఇవ్వాలి. పింఛన్ ఇచ్చేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చారు. ఫొటోలు బాగా రావాలి. మానవత్వం చాటుకుంటున్నట్లు కనిపించేలా సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ పెడితే వైరల్ కావాలనుకున్నారో ఏమో.. అన్ని ఏర్పాట్లు చేశారు. ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని ప్రత్యేకంగా ఆటో ఏర్పాటుచేసి పచ్చ కండువా వేసి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి సచివాలయ సిబ్బందితో స్పాట్ లోనే పింఛన్‌ను ఆటోలోనే ఇప్పించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పని అయిపోయింది. అనార్యోగంతో ఆటోలో ఉన్న వృద్ధుడు బైక్‌పై రయ్‌రయ్‌మంటూ తిరుగుతూ ఇలా ఫొటోలకు చిక్కాడు. –సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


