ఆగిరిపల్లి: శోభనాపురం వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శుభశేఖర్‌ను కలిసి సాంబశివరావుపై దాడి చేసిన నిందితులపై పోలీసులు తీసుకున్న చర్యలును అడిగారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సాంబశివరావును దారి కాచి తన కుమార్తె ముందే దాడి చేశారని, దాడి చేసిన టిడిపి నాయకుల పేర్లును సాంబశివరావు కుమార్తె చెబుతున్నా పోలీసు అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి దాడి చేసిన టీడీపీ నాయకులు ను అరెస్ట్ చేసి బాధితుడు సాంబశివరావుకుకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు బెజవాడ రాంబాబు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యులు వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి, గుర్రం శ్రీనివాసరావు, వలంటరీ విభాగం అధ్యక్షులు భాస్కర్ ప్రసాద్, కంబాల ప్రదీప్ తదితరులు ఉన్నారు.


