ఇంటిగ్రేటెడ్‌ సెన్సింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్‌ సెన్సింగ్‌పై అవగాహన

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

ఇంటిగ్రేటెడ్‌ సెన్సింగ్‌పై అవగాహన

తాడేపల్లిగూడెం: మేథో ఆధారిత రవాణా వ్యవస్థలకు ఇంటిగ్రేటెడ్‌ సెన్సింగ్‌ కమ్యూనికేషన్స్‌ సాంకేతికత ఎంతో కీలకంగా మారనుందని యునైటెడ్‌ స్టేట్స్‌ దేవ్‌కామ్‌ ఆర్మీ రీసెర్చ్‌ లాబోరేటరీ సీనియర్‌ ఫెలో డాక్టర్‌ కుమార్‌ విజయ్‌ మిశ్రా అన్నారు. గురువారం ఏపీ నిట్‌లో సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనా ధృక్కోణాలు అనే అంశంపై నిపుణుల ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సైబర్‌ సెక్యూరిటీ , ఆధునిక రాడార్‌ వ్యవస్థలు, ఇంటిగ్రేటెడ్‌ సెన్సింగ్‌, కమ్యూనికేషన్స్‌ రంగాల్లో ఉద్భవిస్తున్న సవాళ్లు, అవకాశాలు పరిశోధన అంశాల గురించి మిశ్రా తెలియచేశారు. సైనిక, పౌర కమ్యూనికేషన్‌ మౌలిక వసతుల్లో సైబర్‌ భద్రతతో పాటు, సైబర్‌ స్థిరత్వం ప్రాధాన్యం వివరించారు. భవిష్యత్‌లో వైర్‌లెస్‌ నెట్‌వర్కులు, స్వయం చాలక వ్యవస్థలు, స్మార్ట్‌ రక్షణ వేదికలు మేథో ఆధారిత రవాణా వ్యవస్థలకు ఐఎస్‌ఏసీ సాంకేతికత కీలకంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్‌ వి.సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement