న్యూస్‌రీల్
డీపీఓగా మల్లికార్జునరావు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన జీవీకే మల్లికార్జునరావు బుధవారం కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు.
కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు దివంగత వేటుకూరి శివరామరాజు కుమారులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు.
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. దెందులూరు ఎమ్మెల్మే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గతంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఉద్దేశించి చింతమనేని కోవర్టు అంటూ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా పార్టీ నుంచి గెంటేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ చింతమనేనిని ఉద్దేశించి జెడ్పీ చైర్‌పర్సన్ విమర్శలు చేశారు. దీంతో కూటమి కుమ్ములాటకు మళ్లీ తెరలేచింది.
చింతమనేని ప్రభాకర్ కొద్ది నెలల క్రితం జరిగిన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడి ప్రమాణస్వీకార సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీలో కోవర్టులున్నారని.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యలు చేయగా అదే వేదికపై ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అధిష్టానందే తుది నిర్ణయమని, దానికనుగుణంగా అన్ని ఉంటాయని బదులిచ్చారు. దీంతో మంత్రి వర్సెస్ చింతమనేని వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చింతమనేని జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీని ఉద్దేశించి మాట్లాడారు. గత కొన్నేళ్ళుగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ టీడీపీలో చేరికను చింతమనేని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
నియోజకవర్గంలో జెడ్పీ చైర్‌పర్సన్‌కు చెక్!
సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ వేదికపైన, ఎమ్మెల్యేలకు కింద కుర్చీలు వేయడంపై ఒకసారి వివాదం రేగింది. జెడ్పీ చైర్‌పర్సన్ సొంత మండలమైన పెదపాడులోని సత్యవోలు, నాయుడుగూడెం, కొత్తముప్పర్రులో పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యశాఖ నిధులతో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి జెడ్పీ చైర్‌పర్సన్ పేరు లేకుండా శిలాఫలకాలు ఎమ్మెల్యే వేయించారనేది ఆరోపణ.
సత్యవోలులో సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయ్యి కార్యకలాపాలు ప్రారంభమైనా ఓపెనింగ్ చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారనేది అభియోగం. తాజాగా జెడ్పీలో గ్రూపులు ఏర్పాటు చేసి చైర్‌పర్సన్ నిర్ణయాలకు గండికొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ప్రొటోకాల్ వివాదంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు దెందులూరులో అడ్డగోలుగా మైనింగ్ దందా సాగుతున్న క్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ మైనింగ్ తవ్వకాలపై సమీక్ష నిర్వహించడం చింతమనేనికి కోపం తెప్పించింది. దీనిపై ఇన్‌చార్జి మంత్రి జెడ్పీ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. దెందులూరు ఎమ్మెల్యే పైనా జెడ్పీ చైర్‌పర్సన్ సీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనను పార్టీ నుంచి గెంటివేయడానికి దెందులూరు నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
కూటమిలో కుమ్ములాటల పర్వం
జెడ్పీ చైర్‌పర్సన్‌ను గతంలో కోవర్టు అన్న చింతమనేని
పార్టీ నుంచి గెంటేయడానికి చింతమనేని ప్రయత్నం: జెడ్పీ చైర్‌పర్సన్
పద్మశ్రీ


