ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ శాఖలో సుదీర్ఘకాలం నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న 10 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి. వారందరికీ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎకై ్సజ్ అధికారి ఏ.ఆవులయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత చేతులమీదుగా పదోన్నతుల నియామక పత్రాలను అందజేశారు. ఇందులో ఎకై ్సజ్ హెడ్‌కానిస్టేబుళ్లుగా.. కే.నాగరాజు, యు.ఫిలిప్, పీ.రామ్మోహనరావు, జే.గోపాలకృష్ణ, పీ.సత్యనారాయణ, బీకేఎన్ సింగ్, వై.శ్రీరామమూర్తి, కే.సూర్యప్రకాశరావు, కే.వెంకటరామన్న దొర, పీ.శైలజ ఉన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, ఎకై ్సజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కిన ఆనంద్, కార్యవర్గ సభ్యులు పదోన్నతులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.


