పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 45 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 45 అర్జీలు

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 45 అర్జీలు విద్యుత్‌ అధికారులకు పదోన్నతులు పదవీ విరమణ వయసు పెంపునకు ఆమోదం చికిత్స పొందుతూ యువతి మృతి

ఏలూరు టౌన్‌ : ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో 45 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ స్వీకరించారు. ఫిర్యాదులు, వినతులు సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఏలూరు రావాల్సిన పనిలేదనీ.. ఆన్‌లైన్‌ సౌకర్యం ఉంటే నేరుగా మీకోసం వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవ చ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పురోగతికి టోల్‌ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించే అవకాశం ఉందన్నారు.

పెదవేగి స్టేషన్‌కు వాహనం అందజేత

పెదవేగి సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌కు బొలెరో వాహనాన్ని దాత అందజేశారు. పెదవేగి మండలం గార్లమడుగులోని వాహన్‌కాఫీ లిమిటెడ్‌ యా జమాన్యం సుందరరామరాజు కార్పొరేట్‌ సో షల్‌ రెస్పాన్సిబులిటీలో భాగంగా రూ.10 లక్షల విలువైన వాహనాన్ని పెదవేగి సీఐ రా జశేఖర్‌కు అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శివకిషోర్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మునిరాజా, ఆర్‌ఐ సతీష్‌ ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యు త్‌ పంపిణీ సంస్థ డిస్కం పరిధిలో అధికారుల పదోన్నతులు, బదిలీలపై ‘విద్యుత్‌ ఉద్యోగుల్లో బదిలీల చర్చ’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో ప్రచురించిన కథనం నిజమైంది. కథనంలో పేర్కొన్నట్టుగానే ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పి.సాల్మన్‌రాజుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పించి వి శాఖలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో పో స్టింగ్‌ ఇచ్చారు. అలాగే ఏలూరులో ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేఎం అంబేడ్కర్‌కు పదో న్నతి కల్పించి ఏలూరులోనే సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా ఏలూరు సర్కిల్‌ పరిధిలోని పెదవేగిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.గోపాలకృష్ణకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించి రాజమహేంద్రవరం కనస్ట్రక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఏలూరు ఈఈ అంబేడ్కర్‌కు పదోన్నతి కల్పించడంతో ఏర్పడిన ఖాళీని విజయనగరంలో ఈఈ టెక్నికల్‌గా పనిచేస్తున్న ఎం.రాజశేఖరంతో భర్తీ చేశారు.

భీమవరం టెక్నికల్‌ ఏఈఈ సీహెచ్‌ వీరాస్వామికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఏలూరు డీపీఈ–1లో పోస్టింగ్‌ ఇచ్చారు. భీ మవరం ఎస్‌పీఎంలో ఏఈ వి.రాంబాబుకు డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి జీలుగుమిల్లి ఆపరేషన్స్‌ స్థానంలో పోస్టింగ్‌ ఇచ్చారు. నరసాపురం టెక్నికల్‌ ఏఈ బి.మాధురీ దేవికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి పశ్చిమగోదావరి జిల్లా సీటీఎం–1 విభాగంలో పోస్టింగ్‌ ఇచ్చారు. జీలుగుమిల్లి ఆపరేషన్స్‌ డిప్యూటీ ఈఈ కె.రమేష్‌ను ఏలూరు ప్రొటెక్షన్‌ విభాగానికి బదిలీ చేశారు. సోంపేట సీ అండ్‌ ఓలో డిప్యూటీ ఈఈ ఎం.నిరంజన్‌ బాబును పెద వేగి ఆపరేషన్‌ విభాగానికి బదిలీ చేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచే దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్టు సమాచారం వచ్చిందని, ఇది ఎన్‌ జీఓ సంఘ నాయకుల కృషి ఫలితమేనని ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉ పాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాథ్‌ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా ఏపీ ఎన్జీవోస్‌ నాయకత్వం కృషి ఫలితంగా వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించిందన్నారు.

కామవరపుకోట: ఆడమిల్లికి చెందిన నల్లమెల్లి అలేఖ్య (19) అనే యువతి గతనెల 23న ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి.. అలేఖ్య పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె సరిగ్గా ఇంటి పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తిన్నది. ఆమె ను కుటుంబసభ్యులు ఏలూరు అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్విస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తడికలపూడి ఎస్సై ఎస్‌.వల్లీపద్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement