ఏలూరు (టూటౌన్): ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నిర్మూలన సాధ్యమని, మలేరియాపై నిర్లక్ష్యం తగదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మలేరియా వ్యతి రేక మాసోత్సవాల అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక మా సోత్సవాలను ఈనెల 30 వరకు నిర్వహిస్తామన్నా రు. మలేరియా నివారణ, నియంత్రణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జేసీ అభిషేక్ గౌడ, డీఎంహెచ్‌ఓ యు.శోభ, డీఎంఓ పీఎస్‌ఎస్ ప్రసాద్, అడిషినల్ డీఎంహెచ్‌ఓ ఎల్.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 289 అర్జీల స్వీకరణ
ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో 289 అర్జీలు అందాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. జేసీ అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● జంగారెడ్డిగూడేనికి చెందిన యాసారపు నూకరత్నం మ్యూటేషన్, ఆన్‌లైన్ చేయించి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.
● చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన జమ్మిశెట్టి బాబూరావు గ్రామంలో 50 ఏళ్లకు పైగా ఉన్న పుంత దారిని మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
● జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన నెల్లూరి చంద్రశేఖర్ భూమిని రీసర్వే చేసి ఆన్‌లైన్ లో నమోదు చేయాలని కోరారు.
● ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన సైదు దుర్గా చేపల చెరువును సర్వే చేయించి హ ద్దులు నిర్ణయించాలని కోరారు.
● భీమడోలు మండలం పూళ్లకు చెందిన బొల్లారపు భాస్కరరావు అర్జీనిస్తూ తమ గ్రామంలో రోడ్డుపై మట్టి, కంకర పోసి చాలా రోజులైయిందని, రో డ్డు పనులు చేపట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.


