కొయ్యలగూడెం : నయవంచనకు, నమ్మక ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు నిదర్శనంగా నిలుస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఎద్దేవా చేశారు. కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మనోవేదనతో మరణానికి చంద్రబాబు కారణమయ్యాడన్నా రు. నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన చంద్రబాబు తన పార్టీ ద్వారా ఏనాడు ఒక్కసారి కూడా సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే సంగతి సిగ్గుచేటు అ న్నారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం మో దీ, అమిత్‌షాల దయదాక్షిణ్యాలపై రాష్ట్రంలో మనగలుగుతుంది అన్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, సానుభూతిపరులను గెలిపించుకుని మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు బీజం వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటుకు రెండేళ్లకు సంబంధించిన కరపత్రా లు ప్రదర్శించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు శివారెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి శివరామరాజు, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి మంతెన సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


