డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి ఉంటే న్యాయ విచారణకు సిద్ధం కావాలి. డిజిటల్ విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రశ్నపత్రాల ప్రక్రియతో ఏం సంబంధం? ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్ బాధ్యతలు చూసిన వ్యక్తే కృష్ణా జిల్లా టాపర్‌గా నిలవడం పేపర్ లీకేజీకి ప్రత్యక్ష నిదర్శనం. ఒకవేళ అతను ప్రతిభతోనే పాసైనా.. రికార్డుల నుంచి అతడి పేరు, మార్కులు, ర్యాంకును ఎందుకు డిలీట్ చేశారో సమాధానం చెప్పాలి. డీఎస్సీ తుది మెరిట్ లిస్ట్‌ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై స్పందించలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు కూటమి నాయకులు సమాధానం చెప్పాలి.
– మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త
ప్రభుత్వ అక్రమాల వల్ల దాదాపు 4 వేల మంది అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఈ అన్యాయంపై 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ పట్టించుకోవడం లేదు. ఎంపికై న వారికి మాత్రమే సీక్రెట్‌గా మెసేజ్‌లు పంపడం వెనుక పెద్ద కుంభకోణమే ఉంది. ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు ఆడియోలు బయటకు వచ్చినా చర్యలు లేవు. ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ పోస్టులను సంతలో సరుకులా అమ్మేసిన వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టడంలేదు? స్పోర్ట్స్ కోటా పోస్టుల విక్రయాలపై కచ్చితంగా సీబీఐతో విచారణ చేయించాలి.
– కామిరెడ్డి నాని, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు


