వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు

Jun 1 2026 12:50 AM | Updated on Jun 1 2026 12:50 AM

వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు

పక్కాగా పర్యవేక్షించాలి

పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి

జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ పిలుపు

గణపవరం: ఎన్నికల కమిషన్‌ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ బూత్‌స్థాయి ఏజెంట్లు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కేవీపీ ఫంక్షన్‌ హాల్‌లో ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలకు ఎస్‌ఐఆర్‌ (సర్‌)పై అవగాహన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) మాట్లాడుతూ సర్‌ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు, అభిమానుల ఓట్ల తొలగింపునకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలు సమర్థవంతంగా తిప్పికొ ట్టాలని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎలాంటి దారుణాలైనా చేస్తారన్నారు.

కూటమిపై తీవ్ర వ్యతిరేకత

మాజీ ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందువల్ల రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అలాగే గ్రామాల్లో ఓటర్లు చాలామంది ఇతర పట్ట ణాల్లో ఉంటున్నారని వీరిని స్వగ్రామాలకు రప్పించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తంగా ఉంటే వచ్చే స్థానిక సంసంస్థల ఎన్నికల్లో అఽధికార పార్టీపై ఆధిపత్యం సాధించవచ్చన్నారు.

సర్‌పై నిరంతర సమీక్ష

ఏలూరు జిల్లా ఎస్‌ఐఆర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి పోతుల శివారెడ్డి మాట్లాడుతూ సర్‌ విషయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిరంతరం సమీక్షిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికీ పరిశీలకులను పంపి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. బీఎల్‌ఏలు ప్రతి బూత్‌లోని ఓటర్లను, ఓటర్ల జాబితాలను పరిశీలించాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో సర్‌ ప్రక్రియలో ఓటర్ల తొలగింపు కారణంగా అధికారం కోల్పోవడమే కాక పలువురు ప్రముఖులు ఓటమిపాలయ్యారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

నిశితంగా పరిశీలించాలి

ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 20 నుంచి 30 ఓట్లు తొలగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అందువల్ల బీఎల్‌ఏలు ఓటర్ల జాబితా పరిశీలిస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లను పరిశీలించాలని కోరారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించే పరిస్థితి ఉండకూడదన్నారు. అర్హుల ఓట్లు తొలగించారంటే మన నిర్లక్ష్యమే కారణమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

గణపవరంలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌. చిత్రంలో పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, పాల్గొన్న బీఎల్‌ఏలు, నాయకులు

బూత్‌ కమిటీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ బీవీఆర్‌ చౌదరి మాట్లాడుతూ అనర్హుల ఓట్ల తొలగింపు, అర్హుల ఓట్ల నమోదు ప్రక్రియను పక్కాగా పర్యవేక్షించాలని సూచించారు. టీటీడీ పాలకవర్గ మాజీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ బీఎల్‌ఏలు నియోజకవర్గంలోని ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల ఓట్లు పోకుండా చూడాలన్నారు. వివాహం, మరణాలు, మైగ్రేషన్‌ జరిగితే వారి ఓట్లను అత్యంత పారదర్శకంగా చేర్చడం, తొలగించడం చేయాలన్నారు. నాలుగు మండలా ల పార్టీ కన్వీనర్లు దండు రాము, సంకు సత్యకుమార్‌, మరడ మంగారావు, రావిపాటి శ్రీనివాస్‌, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement