దెందులూరు: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025 పే రుతో నిరుద్యోగ యువతను చేసిన కుటమి ప్రభు త్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, యువజన విభాగం వర్కింగ్ రాష్ట్ర ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్ అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు ధర్నా నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
దెందులూరు : పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాల మ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పలురూపాల్లో రూ.87,715 ఆదాయం లభించిందని ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ ఎన్.సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల స త్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దెందులూరు: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలని, నిల్వ ఉన్న ఎరువులు పాత ధరలకే విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆది వారం దెందులూరులో ఎరువుల సమస్యలపై విలేకరులతో మాట్లాడారు. యూరియా, డీఏపీ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కూడబలుక్కుని రైతులకు సరిపడా అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్టు స్పష్టమవుతోందన్నారు. యూరియా, డీఏపీలపై ఆంక్షలు విధించడాన్ని విరమించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తామని చెబుతూ ఆచరణలో రైతులకు నష్టం కలిగే విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, పాత స్టాకు పాత రేట్లకే అమ్మేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు పంచహారతులు ఇచ్చారు. ఆదివారం రాత్రి కేదారీఘాట్‌లో కలగభద్రుడు స్వామి బ్రహ్మత్వంలో ఏకముక, ద్విముఖ, చతుర్థ పంచమ, కుంభ, నక్షత్ర పూర్ణకుంభ, స్పర్ప కుంభ హరతులు ఇచ్చారు. నదీమ తల్లులను ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భీమవరం: ఒడిశాకు చెందిన ఓ యువతి భీమవరం కొమరాడరోడ్డులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాయగడ్ జిల్లా స గడ ప్రాంతానికి చెందిన బిలామా ఘమంగా (26) పట్టణంలోని ఆక్వా పరిశ్రమలో రొయ్య ల ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తూ వసతిగృహంలో నివసిస్తుంది. ఆదివారం వేకువజామున వసతి గృహానికి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. హెడ్ కానిస్టేబుల్ భూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో యువతితో ప్రేమ వ్యవహారమే కారణం..?
ఆక్వా పరిశ్రమలో పనిచేస్తున్న మరో యువ తితో మృతురాలు సన్నిహితంగా ఉండేది. అదికాస్తా ప్రేమగా మారడంతో ఒకరితో మరొకరు ఆప్యాయంగా ఉండేవారు. అయితే తన స్నేహితురాలు మరో యువకుడితో ఇటీవల ఎక్కువగా మాట్లాడటాన్ని ఘమంగా జీర్ణించుకోలేకపోయింది. ఆ యువతితో ఘర్షణపడి సెల్‌ఫోన్ విసిరికొట్టి వసతిగృహం నుంచి రెండురోజుల క్రితం బయటకు వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా చెట్టుకు తాడు తో ఉరివేసుకుని వేలాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


