దొంగపిండిలో కుంగిన వంతెన | - | Sakshi
Sakshi News home page

దొంగపిండిలో కుంగిన వంతెన

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

దొంగపిండిలో కుంగిన వంతెన

వంతెనపై లారీ వెళ్తూ దిగబడిన వైనం

త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్‌

వంతెన ధ్వంసంతో నిలిచిన రాకపోకలు

గగ్గోలు పెడుతున్న గ్రామస్తులు

భీమవరం అర్బన్‌ : మండలంలోని దొంగపిండి గ్రామంలో బందాల చేడు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెన శనివారం తెల్లవారుజామున కుంగిపోయింది. గోదావరి ఇసుక 3 యూనిట్లతో నిండిన టిప్పర్‌ లారీ వంతెనపైకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే లారీ నుంచి దూకేయడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు.

తాత్కాలిక మరమ్మతులతో సరి

దొంగపిండి గ్రామానికి చుట్టూ ఉప్పుటేరు, బొండాడ, కొచ్చేడు డ్రెయిన్లు ఉండటంతో భీమవరం పట్టనానికి ఏకై క మార్గంగా ఇక్కడ వంతెన ఉంది. సుమారు 1983లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది. గత 5 నెలల క్రితం ఈ వంతెన వద్ద మొదటి ఖానా ధ్వంసం అయినప్పటికీ తాత్కాళిక మరమ్మతులు చేసి కాలం గడిపేశారు. దీంతో ఆటోలు, బస్సులు, లారీలు కొంతకాలం తిరిగాయి. ఇప్పుడు వంతెన ఆవలి వైపు భారీగా కుంగిపోవడంతో ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళుతున్నాయని కనీసం ఆటోలు కూడా వెళ్లడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు నిత్యం కూలిపనుల నిమిత్తం భీమవరం పట్టణం, యనమదుర్రు, దిరుసుమర్రు తదితర గ్రామాలకు ఆటోలు, వ్యాన్‌లపై వెళుతుంటారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. 5 నెలల క్రితం వంతెన కుంగినా ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులు తాత్కాలిక మరమ్మతులు చేశారే తప్ప, పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోలేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. గ్రామంలో రొయ్యలు, చేపలు చెరువులు ఎక్కువగా ఉండటంతో వాటికి మేతలోడులు, చేపలు ఎగుమతుల ద్వారా భారీ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెన ధ్వంసం అవడం వల్ల తీవ్రంగా నష్టపోతామని గ్రామస్తులు, ఆక్వా రైతులు వాపోతున్నారు. త్వరితగతిన అధికారులు, ప్రజాప్రతనిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement