ఆ క్షణం.. ఉద్విగ్నభరితం | - | Sakshi
Sakshi News home page

ఆ క్షణం.. ఉద్విగ్నభరితం

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

న్యూస్‌రీల్‌

పరుచుకున్న ప్రగతి

యువతకు ఉద్యోగాలు కల్పించారు

మహిళలకు అండగా జగన్‌

జగన్‌ పాలనే బాగుంది

2019 మే 30న సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం

ఐదేళ్లు.. ప్రగతి పరవళ్లు

చెప్పింది చేసి చూపించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజల ఆకాంక్ష

రెండేళ్లుగా కూటమి పాలనలో నలిగిపోతున్న జనం

శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026

సాక్షి, భీమవరం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019 మే 30న జగన్‌ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్‌ కోసం వృద్ధుల పడిగాపులకు చెక్‌ పెట్టి 1వ తారీఖు ఉదయాన్నే ఇంటికి వచ్చి సా యాన్ని వారి చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఉచిత పంటల బీమా, ఆర్‌బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సరఫరా చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రైతులకు రూ.796.49 కోట్లు సాయం అందించారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మందికి లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్‌ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రజారోగ్యమే పరమావధిగా..

జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. స్పెషలిస్ట్‌ వైద్యులతో విలేజ్‌ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భద్రతను కల్పించారు

పేదింట డిజిటల్‌ విద్య

పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యాబోధన చేపట్టారు. నాడు–నేడు ద్వారా రూ.369.13 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేశారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు.

కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు

అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యమన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఊరూరా ఊదరగొట్టారు. జూన్‌ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటీకి ఇచ్చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మొదలై అప్పుడే రెండేళ్లు కావస్తుండగా ఆడబిడ్డ నిధి, నిరు ద్యోగభృతి ఊసెత్తడం లేదు. ఇంటికో ఉద్యోగం మాటే లేదు. సంక్షేమం జాడలేక పేదింట కాంతులు, ఆక్వా, వరి రైతులకు భరోసా కరువయ్యాయి. ప్రైవేటీకరణ పేరిట పాలకొల్లులో మెడికల్‌ కళాశాల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అర్ధాంతంగా ఆపేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక నరసాపురంలో ఆక్వావర్సిటీ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ గాల్లో దీపంలా ఉండగా వైద్యశిబిరాల నిర్వహణ లేదు. జిల్లాలో ప్రగతి పడకేసింది. ఇసుక, మట్టి, మద్యం అన్నింటా సిండికేట్ల దోపిడీతో రెండేళ్లకే కూటమి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ జననేత జగన్‌ పాలన రావాలంటూ జనం 2019 మే 30ను గుర్తుచేసుకోవడం కనిపిస్తోంది.

2019 మే 30.. తూరుపు కొండల్లో ఉదయించిన సూర్యునిలా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరపురాని రోజు.. చారిత్రక పాలనకు తొలి అడుగుపడిన రోజు.. పేద బతుకులకు భరోసా వచ్చిన రోజు.. అక్కచెల్లెమ్మలకు ‘చేయూత’గా, వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’గా, అగ్రవర్ణాల పేద మహిళలకు ‘నేస్తం’గా, పేదల చదువులకు ‘అమ్మఒడి’లా, వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలకు అంకురార్పణ పడిన రోజు..

పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలో సుమారు 76,069 మందికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది.

ఆక్వారంగానికి ప్రోత్సహిస్తూ నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వావర్సిటీ మంజూరు చేశారు.

పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కళాశాల పనులు చేపట్టారు.

పాలకొల్లులో రూ.13.50 కోట్ల వ్యయంతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగా, నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు.

దాదాపు రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లు, బల్క్‌మిల్క్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు.

సచివాలయ వ్యవస్థతో ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. సచివాలయ ఉద్యోగులు మే 30న మర్చిపోలేరు. మళ్లీ అలాంటి రోజులు రా వాలని యువత కోరుకుంటోంది. నేడు ప్రచారా ర్భాటం తప్ప ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు.

– మండ విశ్వనాథ్‌ నారాయణరెడ్డి, మార్టేరు

మహిళలకు అన్ని పథకాలు ఇచ్చి అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌ పాలనను అందరూ కోరుకుంటు న్నారు. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం కచ్చితంగా అమలు చేసిన ఏకై క వ్యక్తి జగన్‌. సంక్షేమంతో మహిళకు బాసటగా నిలిచారు. జగన్‌ మళ్లీ అధికారం చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

– కోట సరోజిని వెంకటేశ్వరరావు, ఆచంట

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా ప్ర భుత్వాలు పాలించాయి. ఇన్ని ప్రభుత్వాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎంతో బాగుంది. ఇచ్చి న మాట ప్రకారం పాలన చేసి ప్రజలకు దగ్గర య్యారు. దేశంలోనే ఇలాంటి పాలన ఎక్కడా అందించలేదు. మరలా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం.

– కొండేటి లాజర్‌, కుముదవల్లి

Advertisement
 
Advertisement
Advertisement