న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధుల బహిష్కరణ

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

న్యాయవాదుల విధుల బహిష్కరణ ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం జనగణన వేగిరపర్చాలి

ఏలూరు (టూటౌన్‌): ఆశ్రం ఆస్పత్రి వద్ద న్యాయవాదులపై సంఘ విద్రోహ శక్తులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఏలూరులోని అన్ని కోర్టుల న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈనెల 26న ఆశ్రం ఆస్పత్రి బ్రిడ్జి వద్ద ఏలూరు జిల్లా కోర్టు న్యాయవాది పళ్లపాటి ర మేష్‌, హైకోర్టు న్యాయవాది పొడేటి లక్ష్మయ్యపై సంఘ విద్రోహ శక్తులు ఆగి ఉన్న కారులోంచి వీరిని బయటకు లాగి దాడి చేశారు. రమేష్‌ మెడలోని బంగారు గొలుసును లాక్కొని చంపుతామని బెదిరించారు. దీనికి నిరసనగా ఏలూరు బార్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోనే సీతారామారావు, జనరల్‌ సెక్రటరీ నిమ్మల జ్యోతికుమార్‌, ఉపాధ్యక్షుడు ఎన్‌వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం గణితం పరీక్షకు 2,334 మంది విద్యార్థులకు 1,486 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరీక్షకు 351 మందికి 303 మంది, ఇంటర్‌ ఫిజిక్స్‌ పరీక్షకు 68 మందికి 56 మంది, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షకు 73 మందికి 58 మంది హాజరయ్యారు. 30 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

32 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో 32 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మొత్తంగా 5,290 మంది హాజరయ్యారు. ఫిజిక్స్‌–1 పరీక్షకు 4742 మంది జనరల్‌ విద్యార్థులకు 4,402 మంది, 480 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 344 మంది హాజరయ్యారు. కామర్స్‌–2 పరీక్షలకు 544 మంది హాజరయ్యారు. వీరిలో 291 మంది జనరల్‌ విద్యార్థులకు 260 మంది, 507 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 284 మంది హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సూచించారు. స్థానిక అశోక్‌నగర్‌ కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదుల్లోకి ఇన్విజిలేటర్లు, సిబ్బంది, విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకు రాకూడదన్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ప టిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులకు అర్హులైన అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్‌ సూర్యచక్రవేణి ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు తనను సెల్‌ 9491063810లో సంప్రదించాలని కోరారు.

ఏలూరు (టూటౌన్‌): జనగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని, జిల్లాలో ఇండ్ల గణనను శ నివారం నాటికి పూర్తి చేయాలని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ స్పష్టం చేశారు. జనగణన ప్రగతి, జూన్‌ నెలలో పంపిణీ చేయాల్సిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు తదితర అంశాలపై శుక్రవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా స మీక్షించారు. జనగణనను ఈనెల 30లోపు పూ ర్తి చేయాల్సి ఉందని, ఇంకా పూర్తి కాకపోవడంపై తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement