ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తం

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

ఏలూరు టౌన్‌: ఎన్నికల సంఘం రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (ఓటర్ల జాబితా సవరణ) సర్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ, బీఎల్‌ఏలు శ్రద్ధగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. శుక్రవారం నగరంలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో సర్‌పై బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులు గా ఏలూరు జిల్లా టాస్క్‌ఫోర్స్‌, రాష్ట్ర కార్యదర్శి పో తుల శివారెడ్డి, బూత్‌ కమిటీ జోన్‌ ఇన్‌ఛార్జ్‌ బీవీఆర్‌కే చౌదరి, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు డీవీఆర్‌కే చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బీఎల్‌ఏలు, పార్టీ నేతలకు ఓటరు జా బితా సవరణపై అవగాహన కల్పించారు. సర్‌ అత్యంత కీలకమైన ప్రక్రియ అనీ, ప్రతి బీఎల్‌ఏ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా శ్రద్ధ వహించటంతోపాటు, అక్రమంగా ఓటర్లను చేర్చే పనులు చేస్తే వాటిని గుర్తించి అభ్యంతరాలు నమోదు చేయాలన్నారు. రాబోయే నెలన్నర రోజులు బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని పార్టీ నేతలు, శ్రేణులంతా సమష్ట్టిగా, సమన్వయంతో పనిచేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వే యాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్‌, బూత్‌ కమిటీల నగర అధ్యక్షుడు ఎచ్చర్ల ఉమామహేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ము న్నుల జాన్‌, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం రాాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మానియేల్‌ జయకర్‌, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, లీగల్‌సెల్‌ నగర అధ్యక్షులు ప్రత్తిపాటి తంబి, నగర ఎస్సీసెల్‌ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్‌, బీసీసెల్‌ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు, జిల్లా కార్యదర్శి యుగంధర్‌ప్రసాద్‌, నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement
 
Advertisement
Advertisement