కామవరపుకోట: అడవుల విస్తరణకు సీడ్ బాల్స్ దోహదపడతాయని, జిల్లాలో 12 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా అటవీ శాఖా ధికారి సందీప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తడికలపూడి సెంట్రల్ నర్సరీలో సీడ్ బాల్ తయారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సీడ్ బాల్స్ ప్రాముఖ్యత, వాటి తయారీ విధానం, అడవుల అభివృద్ధిలో వాటి పాత్రపై అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం, భీమవరం, రాజమహేంద్రవరం, ఏలూరు విభాగాలకు చెందిన అటవీ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. మొక్కల పెంపకానికి ప్రజలు సహకరించాలని కోరారు. గ్రీన్ కై ్లమేట్ టీం ప్రతినిధులు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రత్యక్షంగా, ఫారెస్ట్ బీట్ ఆ ఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది గూగుల్ లైవ్ ద్వారా పాల్గొన్నారు.


