ప్రజల అర్జీలపై తక్షణం స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల అర్జీలపై తక్షణం స్పందించాలి

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

ప్రజల అర్జీలపై తక్షణం స్పందించాలి

నిడమర్రు: గ్రామాల్లో నిర్వహిస్తున్న సందర్శన సభల్లో స్వీకరిస్తున్న అర్జీలపై తక్షణం అధికారులు స్పందించి పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సార్లు సందర్శన కార్యక్రమం రెండో సారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముందుగా పలు గ్రామాల్లోని అభివృద్ధి, ప్రధాన సమస్యలు, రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పీహెచ్‌సీ అభివృద్ధిపై దృష్టి

నిడమర్రు సభ అనంతరం పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, తదితరులు పర్యటించి పలు సమస్యలను తెలుసుకున్నారు. పెదనిండ్రకొలను గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించి వైద్య అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అఽధికారులను కోరారు. పెదనిండ్రకొలను పందికోడు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. పత్తేపురంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టాలన్నారు. పత్తేపురం తాగునీటి పథకం మంచినీటి చెరువు ప్రక్షాళన పనులను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.రంగలక్ష్మి, ఎంపీడీఓ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement