ఆకివీడు: విద్యార్థులపై అసభ్యకరంగానూ, అశ్లీల మాటలతో వేధిస్తున్నారనే విద్యార్థుల ఆరోపణల మేరకు స్థానిక ఎస్సీ హాస్టల్ వార్డెన్ పి.శ్రీధర్ పై గురువారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సాక్షిలో వచ్చిన వార్తకు స్పందించిన ఏఎస్‌డబ్ల్యూజే రాజశేఖరరెడ్డి హాస్టల్‌లోని విద్యార్థులతో మాట్లాడారు. దూషణలు, తదితర విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి నివేదిక సమర్పించి, జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ప్రస్తుతం హాస్టల్‌కు ఇన్‌ఛార్జి వార్డెన్‌గా ఉండి వసతి గృహఅధికారిణిని నియమిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు.
కై కలూరు: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించిన వ్యక్తిపై గురువారం కేసు నమోదు చేశామని కై కలూరు రూరల్ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం జంగంపాడు పల్లెపాలెంలో వడుగు దుర్గపై బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన కర్రి దుర్గారావు అనే వివాహితుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి అతను పరారయ్యాడు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించింది.
వార్డెన్ చర్యలపై విచారణ