ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి

Oct 12 2025 7:45 AM | Updated on Oct 12 2025 7:45 AM

ప్రభు

ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి

ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా తరగతులు కిడ్నాప్‌ కలకలం ఎంటీఎస్‌ టీచర్లను క్రమబద్ధీకరించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే సేవా దృక్పథంతో పనిచేయగలవని, ప్రైవేటు వారికి అప్పగిస్తే వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తారని జన విజ్ఞాన వేదిక పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రమేష్‌ అన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి అనే అంశంపై స్థానిక ఎన్‌ఆర్‌పేటలో జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. పీపీపీ విధానం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ రవి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి ఉన్న అంతరాన్ని వివరిస్తూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఇతోధికంగా సేవ చేశాయన్నారు. రిటైర్డ్‌ జడ్జి అడబాల లక్ష్మి మా ట్లాడుతూ కాలేజీల్ని ప్రైవేట్‌పరం చేయడం అంటే రాజ్యాంగ విలువలకి పాతర వేయడమే అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌, సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ పేరిట ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తోందని జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ అన్నారు. వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ శనివారం ఏలూరు ఆర్‌ఆర్‌పేట మస్తర్‌ పాయింట్‌ వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈ విధానాన్ని సీఐటీయూ తిప్పికొట్టిందని, ఆ సందర్భంలో రాష్ట్రంలో మరెక్కడా అమలు చేయమని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ చెప్పారన్నారు. అయితే ఏలూరు కార్పొరేట్‌లో పనులను ప్రైవేట్‌ వ్యక్తలకు అప్పగించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎ.జానుబాబు, నగర కార్యదర్శి ఎం.ఇస్సాకు, జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నారాయణ, చైతన్య విద్యాసంస్థలు సెలవు రోజుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో శనివారం తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను మూయించివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో రోజులో కనీసం గంట కూడా క్రీడలు నిర్వహించకపోవడంతో విద్యార్థులకు మానసిక వికాశం, స్వేచ్ఛ ఉండటం లేదన్నారు. అలాగే ఎన్‌ శాట్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో ఆదివారం నారాయణ విద్యాసంస్థలు నిర్వహించే పరీక్షకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఆయా సమస్యలపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై.అభి, టి.వంశీ, ఎస్‌.రాజా పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌: తాడేపల్లిగూడెంలో ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌కు వచ్చి దుకాణం వద్ద టీ తాగుతున్నాడు. ఇంతలో ఓ కారులో నుంచి ముఖానికి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు దిగి టీ తాగుతున్న వ్యక్తిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. దీంతో అక్కడున్న వారు నిర్ఘాంతపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): డీఎస్సీ–98 మినిమం టైం స్కేల్‌ టీచర్స్‌ (ఎంటీఎస్‌) విజ్ఞాపన దీక్ష రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్స్‌తో శనివారం విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద జరిగినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు కె.మోహన్‌రావు శనివారం తెలిపారు.

ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి 
1
1/1

ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement