
పాత జీఎస్టీ వసూలు చేస్తే చర్యలు
చిచ్చర పిడుగులు
ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు చిచ్చర పిడుగుల్లా దూసుకుపోయారు. 8లో u
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలందరికీ అందాల్సిందేనని, పాత జీఎస్టీ వసూ లు చేస్తే వర్తకులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జిల్లాలో కొందరు వర్తకులు కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేయడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ ప్రయోజనాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి, సందేహాల నివృత్తికి 8712631283 నంబర్‌తో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో 8712631279 నంబర్‌తో ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని వాణిజ్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
అర్థవంతంగా హేలాపురి ఉత్సవం
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హేలాపురి ఉత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేసేలా వర్తకులతో మాట్లాడాలన్నారు. అలాగే హేలాపురి ఉత్సవంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందజేయాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, వాణిజ్య పనులు శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్, పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.