
ప్రైవేటీకరణపై కోటి సంతకాల పోరు
ఉంగుటూరు: పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తే సహించబోమని, ప్రైవేటీకరణకు పేదలకు ఉచిత విద్య, వైద్యం అందవని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. స్థానిక దళితవాడ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వాసుబాబు తొలి సంతకం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో 60 వేలు సంతకాలకు తగ్గకుండా సేకరించాలని పిలుపునిచ్చారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
బుట్టాయగూడెం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావుతో కలిసి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. కోటి సంతకాల ఉద్యమంతో కూటమిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. అలాగే జంగారెడ్డిగూడెంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ప్రారంభించారు. దెందులూరులోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ అన్ని విభాగాల నాయకులు కోటి సంతకాల సేకరణ పోస్టర్లను విడుదల చేశారు.
బుట్టాయగూడెంలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఉంగుటూరులో కోటి సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు

ప్రైవేటీకరణపై కోటి సంతకాల పోరు