నేడు
నాడు
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలు 155 ఉండగా.. కూటమి నేతలు, మద్యం సిండికేట్ చేతుల్లో ఏకంగా 1290కి పైగా బెల్టు షాపులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు, మూడు బెల్టు షాపులు పెట్టుకుని మద్యం విక్రయాలు భారీ ఎత్తున చేస్తున్నారు. అన్ని చోట్లా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చింతలపూడి, కై కలూరు, నూజివీడు, దెందులూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోనూ బెల్టు షాపుల హవా భారీ ఉంది.
జేబులకు చిల్లు
మద్యం కిక్కులో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. చీప్ లిక్కర్‌ను సైతం రూ.20 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో నెలకు సగటున అధిక రేటు కారణంగా మందుబాబుల నుంచి కోట్లలో సొమ్ములు కాజేస్తున్నారు. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 16.80 లక్షల క్వార్టర్ బాటిల్స్ విక్రయిస్తే ఒక్కో బాటిల్‌కు రూ.20ల చొప్పున అధిక ధరకు అమ్ముతున్నారు. నెలకు రూ.3.36 కోట్ల మేర మందుబాబుల మీద అదనంగా లాగేస్తున్నారు. ఏడాదికి చూస్తే కేవలం అధిక రేటు ద్వారానే సుమారుగా రూ.40 కోట్లు వరకూ కూటమి మద్యం సిండికేట్ వ్యాపారులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు అంచనా.
చంద్రబాబు చిత్రపటంపై మద్యం పోస్తూ నిరసన తెలుపుతున్న మహిళలు
ఎకై ్సజ్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బెల్టు షాపులను పూర్తిగా తొలగించి.. కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేలా టైమింగ్స్ పెట్టారు. మద్యం కొనాలంటే షాక్ కొట్టేలా.. చేస్తాననే మాటను నిజం చేస్తూ ధరలు పెంచటంతో పేదవర్గాల ప్రజలు మద్యానికి దూరం అయ్యారు. సిట్టింగ్ రూమ్‌లు లేకపోవటంతో మద్యం తాగేందుకు ఆసక్తి తగ్గింది.
కూటమి సర్కారు హాయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అనారోగ్యం వస్తే మందుల షాపులైనా తెరిచిఉంటాయో లేదో కానీ మద్యం కావాలంటే మాత్రం నో టైమింగ్స్. ఎనీ టైమ్ మద్యం (ఏటీఎం) తరహాలో మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు.. మందుబాబులకు రాత్రీ పగలూ తేడాలేకుండా మద్యాన్ని అందుబాటులో ఉంచారు. ఒకవైపు మద్యం షాపులు, మరో వైపు గ్రామగ్రామాన బెల్టు షాపుల లైట్లు నిత్యం వెలిగే ఉంటున్నాయి. చీఫ్ లిక్కర్ క్వార్టర్ బాటిల్‌పై సైతం రూ.20 అదనంగా బాదేస్తున్నారు.
లిక్కర్ షాపుల్లో అదనపు దోపిడీ
ఒక్కో క్వార్టర్‌పై సుమారు రూ.20కి పైగా అదనంగా వసూలు
ఏడాదికి సిండికేట్ అ‘ధనం’ సుమారు రూ.40 కోట్లు
మద్యం కిక్కులో జేబుకు చిల్లు