
మద్యం దుకాణాల్లో తనిఖీలు
ఎఫెక్ట్
తణుకు అర్బన్ : శ్రీపశ్చిమలో మద్యం దందాశ్రీ శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తణుకు ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి తమ సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల్లో శనివారం తనిఖీలు చేసి మద్యం బాటిల్స్ శాంపిల్స్ సేకరించారు. ఎక్కడా బెల్టు షాపుల నిర్వహణ జరగడంలేదని, ఇంతవరకూ తణుకు స్టేషన్ పరిధిలో 95 బెల్టు షాపులకు సంబంధించి కేసులు నమోదుచేసి వారి నుంచి 135.21 లీటర్ల మద్యం, 3.25 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులందరినీ తహసీల్దారు కోర్టులో బైండోవర్ చేసినట్లు వివరించారు. తణుకులో ఒక మద్యం దుకాణంలో అదనపు ధరలకు విక్రయిస్తున్నట్లుగా ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు చెప్పారు. అదనపు ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: పశ్చిమలో మద్యం దందా కఽథనానికి ఎకై ్సజ్ అధికారులు కదిలారు. గూడెం సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలలో తనిఖీలు చేయడంతో పాటు, మద్యం నమూనాలు సేకరించి పరిశోధనశాలకు పంపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయిస్తున్నారా.. లేదంటే అధిక ధరకు విక్రయిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. 40 మద్యం దుకాణాల్లో ధరలు పరిశీలించారు. ఇప్పటి వరకు స్టేషన్ పరిధిలో 134 బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేశామని ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి అన్నారు. 226 లీటర్ల మద్యం, 7.8 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

మద్యం దుకాణాల్లో తనిఖీలు

మద్యం దుకాణాల్లో తనిఖీలు