
ఎఫెక్ట్
ఇరగవరం: ఇరగవరం మండలంలోని రేలంగి పంచాయతీలో చెత్త వాహనాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో శ్రీమూలకు చేరిన చెత్త వాహనాల్ఙు అనే శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కథనానికి స్పందించిన ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మూలకు చేరిన చెత్త వాహనాలకు మరమ్మతులు చేపట్టారు. పేరుకుపోయిన చెత్తను, జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు.
భీమవరం: భీమవరం పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్ధాయిలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ శనివారం చెప్పారు. స్ధానిక తాలూకా ఆఫీసు సెంటర్‌లోని జీవీఆర్ కల్యాణ మండపంలో ఈ నెల 12వ తేదిన నిర్వహించే చెస్ పోటీల్లో విజేతలకు రూ.లక్ష నగదు బహుమతులు అందచేస్తామన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
మండవల్లి: మండలంలోని పెరికెగూడెంలో సెప్టెంబర్ 2న దేవితల్లి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా దాడి చేసిన ఇద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల చొప్పున రిమాండు విధించినట్లు ఎస్‌ఐ రామచంద్రరావు చెప్పారు. పెరుమాల నరేంద్రబాబు, పిండి కర్ణబాబులు దేశిగణేష్‌పై దాడి చేసి గాయపర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను న్యాయస్ధానంలో హాజరుపర్చగా, రిమాండు విధించినట్లు తెలిపారు.

ఎఫెక్ట్