
నిట్‌లో ముగిసిన టెక్రియా
తాడేపల్లిగూడెం: విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు పెద్దపీట వేసే టెక్రియా 2కె25 కార్యక్రమం శనివారం నిట్‌లో ముగిసింది. విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గ్రాఫిక్ కేఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మర్డర్ మిస్టరీ గేమ్ ఆలోచింపచేసింది. ఈసీఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో కారుకి గైర్ స్కోప్‌ను అనుసంధానం చేసుకుంటూ అవరోధాలు అధిగమిస్తూ, గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చనే విషయాలను విద్యార్థులు వివరించారు. నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఎకో పెయింటింగ్ పోటీలో ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జోష్‌ను నింపాయి.
కొయ్యలగూడెం: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో రామనుజపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీ.నర్సాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పరిటాల నాగచందద్రరావు (42) కొయ్యలగూడెం మండలం రామనుజపురంలో అన్న కుమార్తె వివాహానికి వచ్చాడు. ఇంటి ఆవరణలో చెత్తను శుభ్రం చేస్తూ ఉండగా, సమీపంలోని ఇనప ఊస అడ్డుగా ఉందని తొలగిస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో షాకుకు గురైన నాగచంద్రరావు మృతి చెందాడని ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.
ఉండి మండలంలో మరొకరు..
ఉండి: చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బహుదూర్(19) ఉండి మండలం ఆరేడులో శనివారం సాయంత్రం చేపల చెరువులో మేత వేసేందుకు వెళ్లగా చెరువు గట్టుపై ఉన్న విద్యుత్తు మోటర్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఎండీ నసీరుల తెలిపారు.

నిట్‌లో ముగిసిన టెక్రియా