పాలిసెట్ కేంద్రాల పరిశీలన
నూజివీడు: పట్టణంలోని జెడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్, ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రాలను పాలిసెట్ రాష్ట్ర సెక్రటరీ జీవీ రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. జెడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్‌లో బాలురు 108 మంది, బాలికలు 204 మంది, మొత్తం 312మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌లో బాలురు 293 మంది, బాలికలు 163 మంది కలిపి మొత్తం 456 మంది హాజరవ్వనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు 11 గంటల కంటే ముందుగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలన్నారు. వేసవి నేపథ్యంలో చల్లని నీరు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు.


