ఓట్ల లెక్కింపులో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపులో అప్రమత్తం

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

● చిన్న తేడా కనపడినా అభ్యంతరం

వ్యక్తం చేయాలి

● అనుమానాస్పద లెక్కింపులపై

ఆర్వోకు ఫిర్యాదు చేయాలి

● ప్రతి ఓటునూ జాగ్రత్తగా పరిశీలించాలి

● కౌంటింగ్‌ ఏజెంట్లకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు,

మాజీ ఎమ్మెల్యే రాజా దిశానిర్దేశం

రాజమహేంద్రవరం రూరల్‌: నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్‌లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు. బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పార్టీ నాయకులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు కౌంటింగ్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్లు లెక్కించేటపుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైనవని, ప్రతి ఓటుకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో ఏదైనా వ్యత్యాసం కనిపించినా, లెక్కించిన ఓట్ల సంఖ్యలో తేడాలు ఉన్నట్లు గుర్తించినా వెంటనే సంబంధిత కౌంటింగ్‌ అధికారికి అభ్యంతరం తెలియజేయాలని సూచించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తిస్తూ, ప్రతి రౌండ్‌లో లెక్కించిన ఓట్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన సందర్భాల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్‌ అభ్యర్థి దాసి వెంకట రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేశి శ్రీనివాసులు రెడ్డి, కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement