స్పెల్‌బీ, మ్యాథ్‌బీ గ్రాండ్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

స్పెల్‌బీ, మ్యాథ్‌బీ గ్రాండ్‌ సక్సెస్‌

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

రాజమహేంద్రవరం రూరల్‌: విద్యార్థులను ఆంగ్లభాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆదివారం నిర్వహించిన స్పెల్‌బీ క్వార్టర్‌ ఫైనల్స్‌, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్‌కి విశేష స్పందన లభించింది. ఆదివారం రాజమహేంద్రవరం మోరంపూడిలోని ఆదిత్య తక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పరీక్ష రాయించారు. స్పెల్‌ బీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు కేటగిరీలుగా నిర్వహించగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మ్యాథ్‌బీ సైతం నాలుగు కేటగిరీల్లో నిర్వహించారు. మొత్తం 1200 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు.

కేటిగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో 3, 4 తరగతులకు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులకు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించారు. ఈ పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సవాన్ని నింపుతాయని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి, కాంపిటేటివ్‌ పరీక్షలకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈపరీక్షలను ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ నల్లమిల్లి శృతిరెడ్డి, ఆదిత్య తక్ష్య ప్రిన్సిపాల్‌ లిసాబర్థన్‌, సాక్షి రీజనల్‌ మేనేజర్‌ రమేష్‌రెడ్డి పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూప్‌, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, రాజమండ్రి, ప్రెజెంటింగ్‌ స్పాన్సర్‌గా డ్యూక్స్‌ వాఫీ వ్యవహరించారు.

ఆదిత్య తక్ష్య స్కూల్లో ఉత్సాహంగా సాగిన సెమీ ఫైనల్స్‌

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు

ఆంగ్లభాషా నైపుణ్యాల పెంపుదలకు స్పెల్‌బీ

గణితంలో పట్టు కోసం మ్యాథ్స్‌బీ

‘సాక్షి’కి అభినందనలు తెలిపిన

విద్యార్థులు, తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement