● గోకవరంలో ఇరువర్గాల ఘర్షణ
● ‘కంబాల’పై దాడి దారుణం:
ఎమ్మెల్సీ వీర్రాజు
గోకవరం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఆ వివరాల ప్రకారం.. గోకవరంలో సర్పంచ్ స్థానానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి గాజింగం సత్తిబాబు సతీమణి వల్లీదేవిని బలపర్చగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాస్‌రావు జనసేన పార్టీ నాయకుడు పదిలం మురళీ సతీమణి కనకలక్ష్మిని బలపరిచారు. జనసేన, బీజేపీ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రచార సమ యం నుంచి ఒక వర్గంపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు కంబాల శ్రీనివాస్‌రావు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ప్రా రంభమై తోపులాటకు దారితీసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పింపించారు. అనంతరం కంబాల శ్రీనివాస్‌రావు మీడియా సమావేశంలో మా ట్లాడుతూ పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తన పై, తన అనుచరుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశా రని ఆరోపించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోకవరంలో కంబాల శ్రీనివాస్‌రావు కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటనను అడిగి తె లుసుకున్నారు. అనంతరం వీర్రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వె ళుతున్నామన్నారు. కంబాల శ్రీనివాస్‌రావు, ఆయ న అనుచరుడిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.


