దైవ ఆరాధనతో మానసిక స్థైర్యం | - | Sakshi
Sakshi News home page

దైవ ఆరాధనతో మానసిక స్థైర్యం

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

ఫ కష్టాలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం

పెంచుకోవాలి

ఫ పరిపూర్ణానంద స్వామి

కాకినాడ రూరల్‌: మనిషి తన కాలాన్ని, శక్తిని, ఆలోచనలను దైవంపై కేంద్రీకరించి చేసే ఆరాధనతో మానసిక స్థైర్యం పెంపొందుతుందని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కాకినాడ శ్రీ పీఠంలో జరుగుతున్న మహాశక్తి యాగం గురువారం కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగింది. పీఠంలోని ఐశ్వర్యాంబిక అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. మహిళలు భారీగా తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నవరాత్రులు అంటే కేవలం తొమ్మిది రోజుల పాటు పూజలు చేయడం మాత్రమే కాదని, మనసును దైవచింతన వైపు మళ్లించి, ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుని, జీవితాన్ని సార్థకంగా మలుచుకునే ఆధ్యాత్మిక సాధన అన్నారు. పండగల ప్రాధాన్యం, యాత్రల వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం, ఆహారపు అలవాట్లు, ఆలోచనల శక్తి, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలను విశదీకరించారు. కష్టాలు లేని జీవితం ఎవరికీ ఉండదని, వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం, విశ్వాసం, ఆత్మబలం పెంపొందించుకోవడం ముఖ్యమన్నారు. కాగా.. ఆరో రోజు శుక్రవారం అమ్మవారు బగళాముఖిదేవిగా దర్శనమివ్వనున్నారని, తదుపరి రోజు విద్యార్థుల కోసం సరస్వతీ పూజ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement