సత్యదేవుని గిరి ప్రదక్షిణపై త్వరలో భక్తి గీతం | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని గిరి ప్రదక్షిణపై త్వరలో భక్తి గీతం

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి గిరి ప్రదక్షిణపై భక్తి గీతం రచించి, గానం చేసి దేవస్థానానికి అందజేస్తానని ప్రముఖ గజల్స్‌ గాయకుడు గజల్స్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన గురువారం కుటుంబ సభ్యులతో కలిసి రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కార్తిక పౌర్ణమి రోజు జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణపై ఇప్పటికే ఒకే గీతం ఉందని సిబ్బంది తెలిపారని, త్వరలోనే మరో భక్తి గీతాన్ని రచించి, గానం చేసి వచ్చే నెల 24న జరిగే గిరి ప్రదక్షిణ లోపు దేవస్థానానికి సమర్పిస్తానన్నారు. సత్యదేవుని సుప్రభాతం కూడా సంస్కృతంలో ఉందని, దాన్ని కూడా తెలుగులోకి అనువదిస్తానన్నారు. కాగా.. సత్యదేవుని ఆలయం వద్ద గజల్స్‌ శ్రీనివాస్‌కు పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీస్సులు అందజేయగా, స్వామివారి ప్రసాదాలను ట్రస్ట్‌బోర్డు సభ్యుడు కామర్స్‌ చిరంజీవిరావు, వ్రతపురోహిత సూపర్‌ వైజర్‌, పురోహిత సంఘం మాజీ అధ్యక్షడు నాగాభట్ల రవిశర్మ బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement