జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

నిడదవోలు: జిల్లా స్థాయి అండర్‌ 14, 16 జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ మేరకు నిడదవోలు ఎంఆర్‌ బాలికల కళాశాలలో బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. వీటికి నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారిలో ప్రతిభ చూపిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. వీరందరూ నవంబర్‌ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని నిర్వాహకులు బండి ప్రదీప్‌ వెల్లడించారు.

ఎంపికై న క్రీడాకారులు వీరే..

ఫ అండర్‌ – 14 విభాగంలో ఎన్‌. గ్రీష్మ (తాడిమళ్ల), బి.శాంతి ప్రియ (ఉండ్రాజవరం), ఎన్‌.ప్రేమ్‌ వర్షిత్‌ (రాజమహేంద్రవరం), పి.మణి మంజూష (పాలంగి).

ఫ అండర్‌ – 16 విభాగంలో బి.ప్రేమ్‌ కుమార్‌ (తాడిమళ్ల), జేఎస్‌డీ మణికంఠ (కాటకోటేశ్వరం), కె.అహరోన్‌ (నిడదవోలు), ఎం.ప్రసాద్‌ (రాజమహేంద్రవరం), పి.శివ దుర్గాలక్ష్మి (తాడిమళ్ల), ఎం.దేవి (చింతూరు), పి.ఈశ్వర్‌ ప్రవళిక (రఘుదేవపురం), వై.జయశ్రీ (వేలివెన్ను), జి.పవిత్ర (ఉండ్రాజవరం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement