నలుగురు భవానీ భక్తులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

నలుగురు భవానీ భక్తులకు గాయాలు

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

గండేపల్లి: విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనానికి పాదయాత్రగా వెళుతున్న భవానీ భక్తులను వేర్వేరు చోట్ల ప్రైవేటు ట్రావెల్‌ బస్సు, మోటారు సైకిల్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనల్లో నలుగురు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడికి చెందిన సుమారు 18 మంది భవానీ భక్తులు కాలినడకన విజయవాడకు బయలుదేరారు. బుధవారం రాత్రి జగ్గంపేట శివారున ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం బయలుదేరి గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో తాళ్లూరు పరిధిలోకి వచ్చారు. ఆ సమయంలో ముందు వెళుతున్న లారీని నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఎడమ వైపు నుంచి తప్పించింది. ఈ క్రమంలో రోడ్డు దిగువన నడుచుకుంటూ వెళుతున్న భవానీలను ఢీకొని వెళ్లిపోయింది. దీంతో ఈ భవానీల్లో కొందరు తమ ముందు వెళుతున్న సహచరులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వారందరూ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కు అడ్డుపడి ఆపేశారు. కాగా.. గాయపడిన గనిశెట్టి పద్మరాజు, ఉమ్మిడి కొండబాబు, మిరియాల గంగాధర్‌లను జెడ్‌.రాగంపేట సీహెచ్‌సీకి తరలించినట్టు తెలిపారు. అలాగే మల్లేపల్లి శివారులో నడుచుకుంటూ వె ళుతున్న మరో భవానీ భక్తుడిని మోటార్‌ సైకిల్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ధర్మవరానికి చెందిన పెద్ది రామకృష్ణ గాయపడ్డాడు. అతడిని 108లో సీహెచ్‌సీకి తర లించారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement