రాష్ట్రంలో దుశ్శాసన పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దుశ్శాసన పాలన

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాష్ట్రంలో దుశ్శాసన పాలన సాగుతోందని మహిళలు మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎక్కడ చూసినా చిన్నారులు, యువతులు, సీ్త్రలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పర్యవేక్షణలో పెద్ద సంఖ్యలో మహిళలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ నుంచి శ్యామలా సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంగాడ సత్యప్రియ, ఆచంట అనసూయ, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంకిన భవానీప్రియ, నగర పాలక సంస్థ మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ చోడిశెట్టి సత్యవాణి, మహిళా విభాగం నేతలు కృష్ణవేణి, ఆచంట మారుతీదేవి, మమత, తులసి, విజయలక్ష్మి, దేవులపల్లి సరితారాణి, ఊటుకూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నా గుడ్లప్పగించి చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా మహిళా నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు.

ఫ ఎక్కడ చూసినా

మహిళలపై అకృత్యాలు

ఫ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

ఫ పెద్ద ఎత్తున మహిళల నిరసన

ఫ సర్కారు తీరుపై వైఎస్సార్‌ సీపీ

మహిళా నేతల మండిపాటు

ఫ కందుకూరి విగ్రహానికి

వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement