జీఎస్‌ రావు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జీఎస్‌ రావు సేవలు చిరస్మరణీయం

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

తాళ్లపూడి: నీతి, నిజాయితీలతో ఐదు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలు అందించి, అటు వ్యాపారంలో రాణించి, ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన జీఎస్‌ రావు చిరస్మరణీయుడని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని పెద్దేవంలో బుధవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే దివంగత జీఎస్‌ రావు పెద్ద కార్యం, సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భార్య వెంకటలక్ష్మి, కుమారులు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, సీతారాం, కుమార్తె డాక్టర్‌ పద్మావతి, కుటుంబ సభ్యుడు వరుణ్‌ సాయి తదితరులు శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించిన నాయకుడు జీఎస్‌ రావు అని కొనియాడారు. తానేటి వనిత మాట్లాడుతూ ఆయన ఆశయాలను, సేవలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్‌ బొడ్డు అనంత వెంకట చౌదరి, వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం ఇన్‌చార్జి దవులూరి దొరబాబు, వైఎస్సార్‌ సీపీ నిడదవోలు పరిశీలకుడు గిరజాల బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బండి అబ్బులు, మాజీ ఎంపీపీ కొమ్మిరెడ్డి పరశు రామారావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పోశిన శ్రీలేఖ, రాష్ట్ర కార్యదర్శులు తోట రామకృష్ణ, వల్లభశెట్టి శ్రీనివాస్‌, పిట్టా శ్రీనివాస్‌, పప్పుల లక్ష్మణ్‌ (నాని), మండల కన్వీనర్‌ కొలిశెట్టి నాగేశ్వరరావు, కరిబండి విద్యాసంస్థల యాజమాన్యం కరిబండి గనిరాజు, కరిబండి త్రినాథ స్వామి, రామకృష్ణ, సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే టీవి రామారావు, వివిధ పార్టీల ముఖ్యనాయకులు తరలివచ్చారు.

ఫ కొనియాడిన

జక్కంపూడి రాజా, తానేటి వనిత

ఫ పెద్దేవంలో సంతాప సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement